AP TET SYLLABUS 2020
- Akshara DSC Chittoor

- Feb 5, 2020
- 3 min read
రాష్త్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం కసరత్తు జరుగుతోంది. త్వరలో ఏపీటెట్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం జంది. ఆ తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సమయంతక్కువగా ఉంటుంది. అందువల్ల రెండు పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే సిద్ధం కావాలి. రెంటి సిలబన్‌లో 5-10 శాతం మాత్రమే తేడా ఉంటుంది. ప్రస్తుతం ఉండే పోటీని దృష్టిలో ఉంచుకొని నోటిఫికేషన్ వరకు ఎదురుచూడకుండా ముందే సన్నాహాలు ప్రారంభించాలి.
ఈ నేపథ్యంలో సిలబన్, వివిధ సబ్జెక్టులు, సన్నద్ధత తదితర అంశాలపై విశ్లేషణ… ఉపాధ్యాయ పోస్టులను పూర్తిగా రాత పరీక్షల్లో సాధించిన మెరిట్ ఆధారంగానే భర్తీ చేస్తారు. ఇందుకు టెట్, డీఎస్సీ పరీక్షల్లో సాధించే మార్కులు కీలకం. ఈ పరీక్షలను వేర్వేరుగా / కలిపి నిర్వహించినా సిలబస్ దాదాపు ఒకటే. ఉమ్మడి వ్యూహంతో విజయం సాధించవచ్చు.
ఎస్జీటీ
ఎస్‌జీటీ (సెకండరీ గ్రేడ్ టీచర్) పోస్టులకు అధికంగా పోటీ ఉంటుంది. ఈ కేటగిరీ కోసం నిర్వహించే పరీక్షలో జీకే, కరెంట్ అఫైర్స్, పర్‌స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ గణితం, సైన్స్, సోషల్ నబ్బెక్ట్‌ల నుంచి కంటెంట్, టీచింగ్ మెథడాలజీ (బోధనా పద్ధతులు)పై ప్రశ్నలు ఇస్తారు.
స్కూల్ అసిస్టెంట్
ఎస్‌జీటీ తరవాత స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) పోస్టులకు ఎక్కువ మంది పోటీ పడుతుంటారు. ఈ కేటగిరీ కోసం నిర్వహించే పరీక్షలో జీకే, కరెంట్ అఫైర్స్, పర్‌స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, క్లాస్‌రూం ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ, ఎంచుకున్న సబ్జెక్ట్ నుంచి కంటెంట్, టీచింగ్ మెథడాలజీ (బోధనా పద్ధతులు)పై ప్రశ్నలు ఇస్తారు.
టెట్, డీఎస్సీ సిలబస్‌ను మూడు భాగాలుగా విభజించవచ్చు. అవి..
1 కంటెంట్, బోధనా పద్ధతులు: ఇందులో ఎస్‌జీటీ అభ్యర్థులు సామాన్య శాస్త్రం, సాంఘికశాస్త్రం, గణితం, వాటి బోధనా పద్ధతులను చదవాలి.
2. తెలుగు, ఇంగ్లీష్ భాషలు
3. సైకాలజీ సైకాలజీ: ఈ సబ్దెక్ట్‌ను అందరూ క్లిష్టంగా భావిస్తారు. ఇందులో ఏయే యూనిట్ల నుంచి ఎన్ని ప్రశ్నలను గతంలో అడిగారో గమనిస్తూ చదవాలి. జ్ఞానాత్మక రంగం కంటే అవగాహన, వినియోగాత్మక రంగాలపై ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి. అంశాల వారీగా చూస్తే శిశువికాసం నుంచి 10 – 12 ప్రశ్నలు, అభ్యసనం నుంచి 8 – 10 ప్రశ్నలు, పెడగాగీ నుంచి 7 -10 ప్రశ్నలు రావొచ్చు. ఇందులో ముఖ్యమైన సాంకేతిక పదాలు, పుస్తకాల రచయితలను గుర్తు పెట్టుకోవాలి. ఈ సబ్బెక్ట్ కోసం తెలుగు అకాడమీ కొత్త, పాత పుస్తకాలను చదవాలి.
ఇంగ్లీష్: ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో అంగ్ల మాధ్యమంలో బోధనను తప్పనిసరి చేస్తున్నారు. కాబట్టి ఉపాధ్యాయులకు ఆంగ్లంలో ప్రావీణ్యం ఉండాల్సిందే. కాబట్టి ఇంగ్లీష్‌లో విద్యార్థి స్లాయిలో కాకుండా ఉపాధ్యాయుల స్థాయిలో ఆలోచించి సమాధానం గుర్తించే విధంగా ప్రశ్నలు అడిగే అవకాశంఉంది. కాబట్టి ప్రిపరేషన్‌లో ఈ విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి. ఇందులో ప్రధానంగా టెన్సెస్, పార్ట్ ఆఫ్ స్పీచ్, వొకాబ్యులరీ, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, వాయిస్, కొశ్చన్స్ ట్యాగ్స్, స్పెల్లింగ్ టెస్ట్ విభాగాల నుంచి అడిగే ప్రశ్నల స్థాయి కఠినంగా ఉండొచ్చు.
తెలుగు: ఇందులో కవులు-రచనలు, భాషారూపాలు, ప్రక్రియలు, సామెతలు, జాతీయాలు, అలంకారాలు, ఛందస్సు, కర్తరి, కర్మణివాక్యాలు, ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు, పర్యాయపదాలు, అపరిచిత పద్యం, అపరిచిత గద్యం తదితర అంశాలపై ప్రశ్నలు అడుగుతున్నారు.పుస్తకాల్లో పాఠం చివర ఇచ్చిన ప్రశ్నలను, వ్యాకరణాలను ప్రాక్టీస్ చేస్తే. ఎక్కువ మార్కులు పొందొచ్చు. ప్రధానంగా 8వ తరగతిలోని వ్యాకరణాంశాలను ఎక్కువగా చదవాలి.పాఠ్యపుస్తకాల చివరి పేజీల్లో గల ప్రకృతి,వికృతి, పర్యాయ పదాలు, నానార్హాలు, వ్యుత్పత్యర్థాలు, పద విజ్ఞానంలోని విషయాలను క్షుణ్నంగా పరిశీలించాలి.
గణితం: ఇంటర్, డిగ్రీలలో గణితాన్ని ఒక నబ్బెక్షగా చదివినవారు మినహా మిగిలినవారు ఈ విభాగంలో కొంత న్యూనత, తడబాటుకు లోనవుతారు. గణితంలో మంచి మార్కులకు మొదటగా ప్రాథమిక భావనలైన భిన్నాలు-నిష్పత్తి, అనుపాతాలు, లాభనష్టాలు, శాతాలు, పని-కాలం-దూరం, భాగస్వామ్యం, బారువడ్డీ చక్రవడ్డీ యూనిట్లపై పట్టు సాధించాలి. తద్వారా 80 నుంచి 40 శాతం ప్రశ్నలను సాధించవచ్చు. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే సంఖ్యా వ్యవస్థ, అంక గణితం, రేఖా గణితంనుంచి సుమారు 60 శాతం వరకు ప్రశ్నలను అడుగుతున్నారు. రేఖా గణితంలో త్రిభుజాలు, చతుర్భుజాలు, వృత్తాలకు సంబంధించి ప్రశ్నలు ఇస్తారు. క్షేత్ర గణితంలో వైశాల్యాలు, ఘనపరిమాణాలు, చుట్టుకొలతలపై ప్రశ్నలు అడుగుతారు.ఈ సబ్జెక్ట్‌లో అధిక మార్కుల కోసం అకాడమీ పుస్తకాల్లోని మాదిరి ప్రశ్నలను ఎక్కువ సార్లు సాధన చేయాలి. వివిధ సూత్రాలను ఒక చార్జు రూపంలో రాసుకొని రోజూ గమనం చేసుకుంటే ఎక్కువ కాలం గుర్తుంటాయి.
సైన్స్ (సామాన్య శాస్త్రం): ఇందులో విద్యుత్, ఆమ్లాలు – క్షారాలు, కాంతి, వాయువులు, గతిశాస్త్రం, సూత్రాలు – ఉపయోగాలు, శాస్త్రీయనామాలు, మానవ శరీర నిర్మాణం, విటమిన్లు, వ్యాధులు, పర్యావరణం అంశాలపై ప్రశ్నలను తరుచుగా అడుగుతున్నారు. అంతేకాకుండా ఈ సబ్బెక్ట్‌లో ప్రస్తావించే శాస్త్రవేత్తలు వారి సేవల గురించి ప్రత్యేకంగా చదవాలి. 8 నుంచి10వ తరగతి వరకు ఉన్న పాఠ్య పుస్తకాలు ప్రిపరేషన్‌కు ఉపయోగపడతాయి.
సాంఘిక శాస్త్రం: ఇందులో చరిత్ర, భూగోళ శాస్తం నుంచి ఎక్కువ ప్రశ్నలు పౌర శాస్త్రం, అర్థ శాస్త్రం నుంచి తక్కువ ప్రశ్నలు వస్తాయి. సాంఘిక శాస్త్రంలోని అన్ని పాఠ్యాంశాలను క్షుణ్నంగా చదవడం జనరల్ నాలెడ్జ్ విభాగంలో ప్రశ్నలను సాధించడానికి కొంత వరకు ఉపయోగపడుతుంది.
చరిత్ర: ఇందులో గణతంత్ర రాజ్యాల ఆవిర్భావం, మగధ సామ్రాజ్యం, చోళుల గ్రామ పరిపాలన, కాకతీయులు, విజయనగర రాజ్యం, మొగలులు, బ్రిటీష్ పాలన, స్వాతంత్రోద్యమం వంటి అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి.రాజులు, కట్టడాలు, రచనలు, బిరుదులను చార్జు రూపంలో రాసుకొని చదివితే ఎక్కువకాలం గుర్తుంటాయి.
భూగోళ శాస్త్రం: మ్యాప్‌లను అనుసరిస్తూ చదివితే ఇందులోని అంశాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి.రోజూ ఆంధ్రప్రదేశ్, భారతదేశ పటాలతోపాటు ప్రపంచ పటాన్ని గమనిస్తుండాలి. పటాలతయారీ, శీతోష్టస్థితి రుతుపవన వ్యవస్థ, నదులు, వ్యవసాయం, ఖనిజాలు, ఆంధ్రప్రదేశ్ మృత్తికలు, అడవులు, సముద్ర తరంగాలు,ఖండాలు, సౌర కుటుంబం, భూమి చలనాలు, వాతావరణం అంశాలను సమగ్రంగా చదవాలి.
పౌరశాస్త్రం: ఇందులో కుటుంబం, గ్రామ పంచాయతీ _ మున్సిపాలిటీ, _ ఎన్నికలు,రాజ్యాంగం, బాలల హక్కులు, విద్యా హక్కు చట్టం, శాసనసభ, న్యాయ వ్యవస్థ, ఐక్యరాజ్యసమితి అంశాల నుంచి గతంలో ఎక్కువ ప్రశ్నలు అడిగారు.అర్థశాస్త్రం: ఇందులో ద్రవ్యం, బ్యాంకింగ్, జీవనోవాధులు, సాంకేతిక విజ్ఞాన ప్రభావం, ప్రజారోగ్యం, ఉత్పత్తి కారకాలు, వ్యవసాయం, అభివృద్ది భావనలు, ఉపాధి సౌకర్యాలు, ప్రపంచీకఏదైనా ఒక అంశాన్ని ఎలా బోధించాలో తెలిపేదే బోధనా పద్దతి. అంటే ప్రతి సబ్జెక్ట్‌కు ప్రత్యేకమైన బోధనా పద్ధతి ఉంటుంది. ప్రాథమిక భావనలను అర్థం చేసుకుంటూచదవాలి. చదివేటప్పుడు ఒక క్రమానుగత పద్దతిని పాటిస్తే మంచిది. టెట్‌లో అధిక మార్కులు సాధించాలంటే సైకాలజీ, ఇంగ్లీష్ తెలుగుపై ఎక్కువ దృష్టి సారించాలి. ఎందుకంటే ఈ మూడు అంశాలకు కలిపి 90 మార్కులు ఉన్నాయి.
టెట్ డీఎన్సీ రెండు పరీక్షలకు 5 నుంచి 10 శాతం అటుఇటుగా ఒకే రకమైన పుస్తకాలను చదవాల్సి ఉంటుంది.కాబట్టి బెత్సాహికులు 8 నుంచి 10వ తరగతి వరకు ఉండే పాఠ్యపుస్తకాలనుక్షుణ్నంగా చదవాలి. వాటి ఆధారంగాసొంతంగా నోట్స్ రాసుకోవాలి. ఆ పాఠ్య పుస్తకాలలోని అంశాలలో మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ చదవాలి.ప్రధానంగా సామాన్య శాస్త్రం, సాంఘికశాస్త్రాలలోని పాఠాలు సమాజంలోని మార్పులకు అనుగుణంగా మారుతూంటాయి.
ప్రతి విషయాన్ని క్రమానుగతంగా చదవాలి.చదివిన అంశాలను వీలైనంత వరకుస్నేహితులతో చర్చించాలి. తద్వారా ఆ విషయాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి.ప్రతి సబ్జెక్ట్‌లో పాఠ్యపుస్తకాల్లోని విషయాలను సమకాలీన అంశాలతో అన్వయించుకుంటూ చదవడం ప్రయోజనకరం.

Comments